Thaggedele promo: శ్రీవల్లిగా పూర్ణ.. డ్యాన్స్‌, సాంగ్స్‌తో మెప్పించిన సినీ తారలు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతిఒక్కరి ఇంటిలో నవ్వుల పువ్వులు పూయించేందుకు ఈటీవీ సిద్ధమైంది. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా ప్రత్యేక కార్యక్రమంతో నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వనుంది...

Published : 26 Oct 2021 14:31 IST

దీపావళికి ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘‘తగ్గేదేలే’’

హైదరాబాద్‌: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతిఒక్కరి ఇంటిలో నవ్వుల పువ్వులు పూయించేందుకు ఈటీవీ సిద్ధమైంది. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా ప్రత్యేక కార్యక్రమంతో నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వనుంది. దీపావళి రోజున ‘తగ్గేదేలే’ అనే ఈవెంట్‌తో ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ మేరకు తాజాగా ‘తగ్గేదేలే’ ఈవెంట్‌కు సంబంధించిన ఓ సరికొత్త ప్రోమో ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. 

రోజా, ఇంద్రజ, ప్రియమణి, పూర్ణ, మన్నరా చోప్రా ముఖ్య అతిథులుగా ప్రదీప్‌ వ్యాఖ్యాతగా.. జబర్దస్త్‌, ‘ఢీ’ కంటెస్టెంట్స్‌తో ఈ ప్రోగ్రామ్‌ ఆద్యంతం ఆకట్టుకోనుంది. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ అనే పాటకు శ్రీవల్లిగా పూర్ణ.. ‘డోలే డోలే దిల్ జర జర’ పాటకు ప్రియమణి చేసిన డ్యాన్స్‌కు రోజా, ప్రదీప్‌ ఫిదా అయ్యారు. తరచూ తనదైన ఆటో పంచులతో కడుపుబ్బా నవ్వించే హైపర్‌ ఆది తొలిసారి స్టేజ్‌పై పాట పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌కి మరింత జోష్‌నిస్తూ ‘రొమాంటిక్‌’ హీరో ఆకాశ్‌ పూరీ, ‘పుష్పకవిమానం’ నటుడు ఆనంద్ దేవరకొండ స్టేజ్‌పై తళుక్కున మెరిశారు. ఈ నాన్‌స్టాప్‌ ఫన్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని చూడాలంటే నవంబర్‌ 4న ఈటీవీలో ప్రసారం కానున్న ‘తగ్గేదేలే’ ప్రోగ్రామ్‌ చూడాల్సిందే..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని