Published : 18/08/2021 11:34 IST

Love story: ‘లవ్‌స్టోరి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘లవ్‌స్టోరి’ చిత్రం ఓటీటీలోకి వస్తుందా, థియేటర్లలో విడుదలవుతుందా? ఇంతకీ ఎప్పుడొస్తుంది? అనే ప్రశ్నలన్నింటికీ తాజాగా తెరపడింది. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల రూపొందించిన చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి.సంస్థ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి సంగీతం: పవన్‌ సి.హెచ్‌., ఛాయాగ్రహణం: విజయ్‌ సి. కుమార్‌, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌. ఈ ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలున్నాయని వార్తలు వినిపించాయి. 



Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని