Chiranjeevi: సంపత్‌ నంది కథ చెప్పిన విధానానికి చిరంజీవి ఫిదా..!

సంపత్‌ నంది మంచి కథకుడని.. ఆయన కథ చెప్పే విధానం చాలా బాగుంటుందని అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సంపత్‌నంది దర్శకత్వం వహించిన ‘సీటీమార్‌’ సినిమా ట్రైలర్‌ వీక్షించిన...

Published : 06 Sep 2021 15:21 IST

వీడియో రిలీజ్‌ చేసిన ‘సీటీమార్‌’ టీమ్‌

హైదరాబాద్‌: సంపత్‌ నంది మంచి కథకుడని.. ఆయన కథ చెప్పే విధానం చాలా బాగుంటుందని అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సంపత్‌నంది దర్శకత్వం వహించిన ‘సీటీమార్‌’ సినిమా ట్రైలర్‌ వీక్షించిన చిరు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ట్రైలర్‌ తనకెంతో నచ్చిందని.. ఇలాంటి మహిళా క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలు మరెన్నో రావాలని అన్నారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోని చిత్రబృందం సోమవారం నెట్టింట్లో షేర్‌ చేసింది.

‘‘గోపీచంద్‌-తమన్నా-భూమిక కీలకపాత్రల్లో నటించిన ‘సీటీమార్‌’ ట్రైలర్‌ చూశాను. నాకు బాగా నచ్చింది. గ్రామీణ క్రీడగా చెప్పుకునే కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘రచ్చ’ నుంచే సంపత్‌నంది నాకు బాగా తెలుసు. ఆయన మంచి కథకుడు. తను అనుకున్న కథను సినిమా రూపంలో చాలా చక్కగా చెప్పగలడు. ‘రచ్చ’ సమయంలోనే ఆయన నరేషన్‌కి ఫిదా అయిపోయాను. ఆ సినిమా బాగా ఆడింది. మంచి కథాంశంతో ‘సీటీమార్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. మహిళా క్రీడా నేపథ్యంలో మరెన్నో సినిమాలు రావాలి. అందరిలో స్ఫూర్తి నింపాలి. ఇటీవల ఒలింపిక్స్‌లోనూ మహిళలు సత్తా చాటి పతకాలు గెలుచుకున్నారు. ఆడబిడ్డలంటేనే మనకు గర్వకారణం. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను’ అని చిరు అన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని