Marakkar: అరేబియా సింహం.. వేట

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మరక్కార్‌’. అరేబియా సముద్ర సింహం.. అన్నది ఉపశీర్షిక. ప్రియదర్శన్‌ తెరకెక్కించారు. కీర్తి సురేష్‌, కల్యాణి ప్రియదర్శన్‌, అర్జున్‌, సునీల్‌ శెట్టి

Updated : 22 Nov 2021 07:12 IST

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మరక్కార్‌’. అరేబియా సముద్ర సింహం.. అన్నది ఉపశీర్షిక. ప్రియదర్శన్‌ తెరకెక్కించారు. కీర్తి సురేష్‌, కల్యాణి ప్రియదర్శన్‌, అర్జున్‌, సునీల్‌ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డిసెంబర్‌ 2న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘ఓ ఆసక్తికర చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. యాక్షన్‌కు, గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. మోహన్‌లాల్‌తో పాటు అర్జున్‌, సునీల్‌ శెట్టి, ప్రభుల నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి సంగీతం: రొన్నీ రాఫెల్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.తిరునావుక్కరసు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని