Panchanama: వినూత్నమైన కథతో.. ‘పంచనామ’

త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ్‌ జాదవ్‌, ముక్కు అవినాష్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచనామ’. సిగటాపు రమేష్‌ నాయుడు దర్శకుడు. గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మించారు. ఈ చిత్ర

Updated : 03 Dec 2021 09:31 IST

త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ్‌ జాదవ్‌, ముక్కు అవినాష్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచనామ’. సిగటాపు రమేష్‌ నాయుడు దర్శకుడు. గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నిర్మాత దిల్‌రాజు ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ వినూత్నమైన కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. సినిమాలోని నటీనటులందరూ వారి పాత్రలకు న్యాయం చేశార’’న్నారు. ‘‘ఇది కచ్చితంగా ప్రజాదరణ పొందే చిత్రమని.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే అర్థమైంది. బడ్జెట్‌ పరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నాం. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌ చంద్ర.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని