Samantha: విడిపోయిన తర్వాత పేరు మార్చుకున్న సామ్‌..

విడిపోతున్నట్లు ప్రకటించిన అనంతరం నెట్టింట్లో నాగచైతన్య, సమంత హాట్‌ టాపిక్‌గా మారారు. దీంతో, నెటిజన్ల చూపు వాళ్లిద్దరి సోషల్‌మీడియా ఖాతాలపైనే పడింది. ఈ క్రమంలోనే తాజాగా నటి సమంత...

Updated : 04 Oct 2021 05:25 IST

ప్రేమ ఒక్కటే సరిపోదు అంటూ చిన్మయి పోస్ట్‌

హైదరాబాద్‌: విడిపోతున్నట్లు ప్రకటించిన అనంతరం నెట్టింట్లో నాగచైతన్య, సమంత హాట్‌ టాపిక్‌గా మారారు. దీంతో, నెటిజన్ల చూపు వాళ్లిద్దరి సోషల్‌మీడియా ఖాతాలపైనే పడింది. ఈ క్రమంలోనే తాజాగా నటి సమంత తన పేరు మార్చుకున్నారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలకు ‘Samantha’ అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఆమె ఫేస్‌బుక్‌ ఖాతా మాత్రం ‘Samantha Akkineni’ పేరుతోనే కొనసాగుతోంది. 2017లో నాగచైతన్యతో ఏడడుగులు వేసిన తర్వాత సామ్‌ తన సోషల్‌మీడియా ఖాతాలకు ‘Samantha Akkineni’గా పేరు మార్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె జులై నెలాఖరులో ట్విటర్‌, ఇన్‌స్టాలకు ‘S’ అని మార్చి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

ప్రేమ ఒక్కటే సరిపోదు..!

పెళ్లికి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఒక్కటే సరిపోదంటూ నటి సమంత ప్రాణస్నేహితురాలు చిన్మయి చేసిన పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. చై-సామ్‌ విడిపోతున్నట్లు ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ఇన్‌స్టా వేదికగా చిన్మయి షేర్‌ చేసిన ఓ సందేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘పెళ్లి చేసుకోవడానికి ముందు.. మీ ఖర్చులు, ఆదాయం, అప్పులు, మతం, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, పిల్లల పెంపకంపై అభిప్రాయాలు, చిన్ననాటి భయాలు, కుటుంబంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు, మానసిక ఆరోగ్యం, కలల నివాసం, కెరీర్‌, విద్య, రాజకీయాలపై మీకున్న ఆలోచనలు, వైవాహిక జీవితం, జీవిత భాగస్వామిపై మీకున్న అంచనాల గురించి ముందే చర్చించండి. ఎందుకంటే జీవితానికి ప్రేమ ఒక్కటే సరిపోదు కాబట్టి’ అనే సందేశాన్ని చిన్మయి షేర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని