Updated : 12/11/2021 07:38 IST

Shyam Singha Roy: శ్యామ్‌ సింగరావోయ్‌

నాని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. డిసెంబర్‌ 24న తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నెల 18న టీజర్‌ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. బెంగాల్‌ గడ్డపై మీసం తిప్పిన తెలుగోడి కథతో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ తెరకెక్కిందని, ఇటీవల విడుదల చేసిన రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌ పాటకి విశేషమైన స్పందన లభించిందని సినీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ రవీంద్రన్‌, మురళీశర్మ, అభినవ్‌ గోమటం, జిషు సేన్‌ గుప్తా, లీలా సామ్సన్‌, మనీష్‌ వద్వా, బరున్‌ చందా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, కూర్పు: నవీన్‌ నూలి, కథ: సత్యదేవ్‌ జంగా.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్