Sirivennela Seetharama Sastry: పాటల సిరి సంపన్నుడు ‘సిరివెన్నెల’

అక్షరాన్ని అందలం ఎక్కించిన నేర్పరి. పాటని గంగా ప్రవాహంగా మార్చి పరవళ్లు తొక్కించిన కూర్పరి. తెలుగు

Updated : 09 Dec 2023 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అక్షరాన్ని అందలం ఎక్కించిన నేర్పరి. పాటని గంగా ప్రవాహంగా మార్చి పరవళ్లు తొక్కించిన కూర్పరి. తెలుగు సినీ వనంలో పద కుసుమాలను పూయించి, సిరివెన్నెలను చిలికించిన గీతకారుడు సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆలోచన... ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు.. సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. అప్పటి సినీ సంగీత ప్రయాణం నిర్విరామంగా సాగుతూనే ఉంది. ‘సరస స్వర సుర ఝరీ గమనమౌ’ అంటూ మొదలైన ప్రయాణంలో ఎన్నో అవార్డులు. ఒకటి కాదు, రెండు కాదు, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఆయన సాహిత్యానికి కానుకగా వరించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గీత రచయితగా 11సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఆయన సాహిత్యం అందించిన పాటలు..నంది అవార్డులు గెలుచుకున్న విశేషాలు..

మొదటి పాటకే నంది వచ్చింది

* సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట ‘విధాత తలపున’. ‘సిరివెన్నెల’ సినిమాలోని పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్‌ స్వరాలు సమకూర్చారు.


* రెండోసారి కూడా కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాకే ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు సీతారామశాస్త్రి. ‘శ్రుతిలయలు’లో ‘తెలవారదేమో స్వామి’ అంటూ సాగే పాటకు కె.వి.మహదేవన్‌ ట్యూన్‌ ఇవ్వగా, సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.


* ఇక ముచ్చటగా మూడోసారి కె.విశ్వనాథ్‌ డైరెక్ట్‌ చేసిన సినిమాలోని పాటకే నందిఅవార్డు సీతారామశాస్త్రిని వరించింది. ఇళయరాజా స్వరాలు అందించిన ‘స్వర్ణకమలం’లో ‘అందెల రవమిది పదములదా!’ అంటూ సాగే పాట ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధులను చేసింది.


* రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు కీలక పాత్రలో నటించిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘గాయం’. ఇందులో ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని’ అంటూ సాగే పాటను సిరివెన్నెల రాశారు. శ్రీ కొమ్మినేని స్వరాలు సమకూర్చిన ఈ పాటకు నంది అవార్డు దక్కింది.


ఐదో నంది అవార్డు ‘చిలుక ఏ తోడు లేక’(శుభలగ్నం)


ఆరో నంది అవార్డు ‘మనసు కాస్త కలత పడితే(శ్రీకారం)


ఏడో నంది అవార్డు ‘సింధూరం’ ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే’


ఎనిమిదో నంది అవార్డు ‘ప్రేమకథ’ (దేవుడు కరుణిస్తాడని)


తొమ్మిదో నంది అవార్డు ‘చక్రం’ (జగమంత కుటుంబం నాది)


పదో నంది అవార్డు ‘గమ్యం’ (ఎంత వరకూ ఎందుకొరకు)


పదకొండో నంది అవార్డు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (మరీ అంతగా)


ఫిల్మ్‌ ఫేర్‌ సౌత్‌

* నువ్వొస్తానంటే నేనొద్దంటానా

* గమ్యం

* మహాత్మ

* కంచె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు