SPB: మనల్ని మనం ఎలా మరిచిపోమో బాలు గారిని మరిచిపోం: సిరివెన్నెల

‘మనల్ని మనం ఎలా మరిచిపోమో బాలు గారినీ అలానే మరిచిపోం’ అని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు.

Published : 03 Oct 2021 23:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మనల్ని మనం ఎలా మరిచిపోమో బాలు గారినీ అలానే మరిచిపోం’ అని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. బాల సుబ్రహ్మణ్యం వర్థంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ ఈటీవీ ‘గాన గాంధర్వం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమానికి సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి, నటుడు ఆలీ, సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు హాజరయ్యారు. బాల సుబ్రహ్మణ్యంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘విస్మృతి అన్న మాటొస్తేనే స్మృతి వస్తుంది. అల్జీమర్స్‌లాంటి రోగం వస్తే తప్ప మనల్ని మనం మరిచిపోం. మనల్ని మనం ఎలా మరిచిపోమో బాలుగారిని మరిచిపోం. రెండు తరాల్ని పరిపూర్ణంగా ప్రభావితం చేసిన మహానుభావుడాయన. మన కళ్లు ఆయన చిరునవ్వుకి, మన చెవులు ఆయన పాటకి, మన హృదయం ఆయన వ్యక్తిత్వానికి ఎప్పుడో అంకితం అయ్యాయి’ అని సీతారామశాస్త్రి అన్నారు. గాన గాంధర్వుడు బాలు గురించి ఆలీ, తమన్‌, తనికెళ్ల భరణి ఏమన్నారో వారి మాటల్లోనే వినండి..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని