Shahrukh Khan: షారుక్ పుట్టిన రోజున.. వెలుగులు విరజిమ్మిన బుర్జ్‌ ఖలీఫా

ప్రతి సంవత్సరంలానే ఈ సారి బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్ పుట్టినరోజున దుబాయ్‌లోని ఆకాశహర్మ్యం బుర్జ్‌ ఖలీఫా వెలిగిపోయింది.

Updated : 03 Nov 2021 13:25 IST

దుబాయ్‌: ప్రతి సంవత్సరంలానే ఈ సారి బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్ పుట్టినరోజున దుబాయ్‌లోని ఆకాశహర్మ్యం బుర్జ్‌ ఖలీఫా వెలిగిపోయింది. ఆయన 56వ జన్మదినం సందర్భంగా  నిన్న రాత్రి హ్యాపీ బర్త్‌డే అంటూ శుభాకాంక్షలు చెప్పింది. వి లవ్‌ యూ అంటూ ఆయన చిత్రాన్ని ప్రదర్శించింది. అలాగే షారుక్ ఆల్‌ టైం హిట్ అయిన దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాలోని తుజే దేఖా పాటను బ్యాగ్రౌండ్‌లో వినిపించింది.  దీనికి సంబంధించిన వీడియోను మహ్మద్ అలబ్బర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, నూన్ అనే ఈ కామర్స్ వెంచర్ వ్యవస్థాపకుడు ఈ మహ్మద్. వారి కుటుంబం తరఫు నుంచి ఈ బాలీవుడ్ బాద్‌షాకు ప్రతి సంవత్సరం ఇలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతాయి. వారి అభిమానానికి షారుక్ కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని