Sridevi Drama Company: నువ్వు ఇలియానా కాదమ్మా జస్ట్‌ అరియానా!

‘జబర్దస్త్‌’ నటులే కాదు మేమూ పంచ్‌లు వేయగలమని ధారావాహికల్లో మెరిసే నటీమణులు, టీవీ వ్యాఖ్యాతలు నిరూపించారు.

Updated : 17 Aug 2022 10:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘జబర్దస్త్‌’ నటులే కాదు మేమూ పంచ్‌లు వేయగలమ’ని ధారావాహికల్లో మెరిసే నటీమణులు, టీవీ వ్యాఖ్యాతలు నిరూపించారు. ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. ఈ వినోదభరిత ఎపిసోడ్‌ అక్టోబరు 31న ప్రసారంకానుంది. వారి వినోదాల విందు ఎలా ఉంటుందో ప్రోమో రుచి చూపించింది. ఆ విశేషాలివీ.. ‘కార్తీక వనభోజనాలు’ పేరుతో ఈ ఎపిసోడ్‌ రూపొందింది. అతిథులుగా వచ్చిన లాస్య, అరియానా తదితరులు తమదైన శైలిలో పంచ్‌లు విసిరి అలరించారు. ‘నేనొచ్చి చాలాసేపయింది. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఎవరూ అడగట్లేదే’ అని అరియానా అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే లాస్య కౌంటర్‌ ఇచ్చి అందరి మోముల్లో నవ్వులు తీసుకొచ్చింది. ‘నువ్వు ఇలియానా కాదమ్మా. జస్ట్‌ అరియానా’ అని లాస్య చెప్పగానే షోలో ఉన్నవారి పొట్ట చెక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతలా నవ్వించిందామె. ఇలా జోక్స్‌కే పరిమితం కాకుండా డ్యాన్స్‌తోనూ ఆకట్టుకున్నారు. ఈ హంగామా అంతా పూర్తయ్యాక పంక్తి భోజనం చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వినోద భోజనాన్ని మీరూ రుచి చూడండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని