Thaggede le: తగ్గేదే లేదంటున్న జోడీ

నవీన్‌ చంద్ర కథానాయకుడిగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఇందులో దివ్య పిళ్లై, అనన్య సేన్‌ గుప్తా కథానాయికలుగా నటిస్తున్నారు.

Updated : 24 Nov 2021 08:14 IST

వీన్‌ చంద్ర కథానాయకుడిగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఇందులో దివ్య పిళ్లై, అనన్య సేన్‌ గుప్తా కథానాయికలుగా నటిస్తున్నారు. దివ్య పిళ్లై పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘‘నేర నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ చిత్రమిది. నవీన్‌చంద్ర, దివ్య పిళ్లై జోడీ మధ్య కెమిస్ట్రీ సినిమాకి హైలెట్‌గా నిలవనుంది. ఇదివరకే విడుదల చేసిన పోస్టర్‌కి, టీజర్‌కి చక్కటి ఆదరణ లభించింది. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అని సినీ వర్గాలు తెలిపాయి. నాగబాబు, డానీ కుట్టప్ప, రవికాలే, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్‌, సంగీతం: చరణ్‌ అర్జున్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని