Published : 22/10/2021 01:36 IST

Thaggedele: ఒకే వేదికపై ఐదుగురు నాయికలు.. ‘తగ్గేదేలే’

ఇంటర్నెట్‌ డెస్క్: ఐదుగురు హీరోయిన్లు ఒకే స్టేజ్‌పై దర్శనమిస్తే ఎలా ఉంటుంది? వారంతా నవ్వుతుంటే ఎంతందంగా ఉంటుంది? ఐదుగురూ ఓకేసారి పెర్ఫార్మెన్స్‌ ఇస్తే ఎలా ఉంటుంది? ఈ పండగలాంటి వాతావరణాన్ని దీపావళి పండగరోజు చూపించబోతుంది మీ అభిమాన ఛానల్‌ ‘ఈటీవీ’. ప్రతి పండగకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించే ఈ ఛానల్‌ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘తగ్గేదేలే’ అనే స్పెషల్‌ ఈవెంట్‌ని ముస్తాబుచేసింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ఈవెంట్‌కి ప్రదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ల గురించి ప్రదీప్‌ చెప్పిన ఇంట్రోతో ప్రారంభమైన ఈ ప్రోమో ఆద్యంతం అలరించేలా ఉంది. ప్రదీప్‌ చెప్పిన ఆ ఐదుగురు నాయికలు ఎవరో కాదు... రోజా, ఇంద్రజ, ప్రియమణి, పూర్ణ, మన్నారా చోప్రా. పేరుకి తగ్గట్టే వారంతా తమ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో ‘తగ్గేదేలే’ అనిపించారు. అయితే ఇది టీజర్‌ మాత్రమే. అసలైన సినిమా చూడాలంటే నవంబరు 4 ఉదయం 9:00 గం.ల వరకు ఆగాల్సిందే.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని