Published : 11/10/2021 21:26 IST

Sudigaali Sudheer: 27 ఏళ్ల ‘యమలీల’.. నరకానికి వెళ్లిన సుధీర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందిన చిత్రాల్లో ‘యమలీల’ ఒకటి. ఆలీ ప్రధాన పాత్రలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ‘భవిష్యవాణి’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో విశేషంగా అలరించింది. ఈ సినిమా ప్రేక్షకులముందుకొచ్చి 27 వసంతాలు పూర్తయిన సందర్భంగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమంలో వేడుకల్ని నిర్వహించారు. సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ఇది. అక్టోబరు 17న ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులోని విశేషాలివీ..

‘యమలీల’ సినిమాలో ఆలీకి  ‘భవిష్యవాణి’ కంటపడినట్టే ఇక్కడ సుధీర్‌కి కనిపించింది. అది ఓపెన్‌ చేయగానే ‘‘జబర్దస్త్‌’కి రాకముందు సుధీర్‌ చేసిన పనులు’ అనే శీర్షిక దర్శనమిస్తుంది. ఈ క్రమంలో బట్టలు ఉతుకుతూ, టాయిలెట్లు కడుగుతూ సుధీర్‌ కామెడీ పండించాడు. తర్వాతి పేజీలో.. తాను రెండు గంటల్లో నరకానికి వెళ్లనున్నట్టు తెలుసుకుంటాడు. వెంటనే ‘యమా’ అంటూ యముడిని తలచుకుంటాడు. మరుక్షణమే యముడిగా గెటప్‌ శ్రీను ప్రత్యక్షమై, విశేషంగా అలరించాడు. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి, ఇంద్రజ, ఆలీ ఎంట్రీ ఆకట్టుకుంది. ‘యమలీల’లోని సన్నివేశాలు, పాటలతో సుధీర్‌, ఆది, విష్ణుప్రియ, రామ్‌ ప్రసాద్‌ మైమరపించారు. ‘మరో రెండు గంటల్లో సుధీర్‌ నరకానికి వెళ్తున్నాడట’ అంటూ ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ చెప్పడం నవ్వులు పంచింది. ఆలీ, ఇంద్రజ చేసిన డ్యాన్స్‌ వావ్‌ అనిపించింది. ఈ సందడంతా చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి...


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని