Published : 30/09/2021 12:16 IST

Naga Chaitanya: జీవితాంతం ఈ జ్ఞాపకాలు గుర్తుండిపోతాయ్‌..!

పోస్ట్‌ పెట్టిన నటుడు నాగచైతన్య

హైదరాబాద్‌: ఇటీవల విడుదలైన ‘లవ్‌స్టోరీ’తో తన కెరీర్‌లో మరో హిట్‌ అందుకున్నారు నటుడు నాగచైతన్య. ఫీల్‌గుడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య.. రేవంత్‌ అనే మధ్యతరగతి కుర్రాడి పాత్రలో నటించి అందరి మన్ననలు అందుకున్నారు. ఆయనకు జోడీగా సాయిపల్లవి ఎప్పటిలాగానే తనదైన శైలిలో మెప్పించారు. కాగా, ‘లవ్‌స్టోరీ’ విజయంపై తాజాగా నాగచైతన్య స్పందించారు. తనకు సూపర్‌హిట్‌ అందించిన టీమ్‌ మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు. తాను జీవితాంతం గుర్తుంచుకొనేలా ఎన్నో మధుర జ్ఞాపకాలను ‘లవ్‌స్టోరీ’ అందించిందని నాగచైతన్య అన్నారు. ఈ మేరకు టీమ్‌తో దిగిన ఓ ఫొటోని ఆయన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

కుల వ్యవస్థ, అమ్మాయిలపై కుటుంబసభ్యులే లైంగిక దాడులకు పాల్పడుతున్నారనే సున్నితమైన అంశాలతో ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని రూపొందించారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈసినిమాలో చై జుంబా ట్రైనర్‌గా మెప్పించారు. బీటెక్‌ పూర్తి చేసి.. ఉద్యోగ వేటలో ఉన్న అమ్మాయిగా సాయిపల్లవి నటించారు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ, దేవయానీ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించి.. తమ నటనతో మంచి మార్కులు కొట్టేశారు. పవన్‌ మ్యూజిక్‌తో మేజిక్‌ చేశారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌, రామ్మోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్