Raviteja: రవితేజ సినిమాలో నటించడానికి స్టార్‌ హీరోలు ‘నో’చెప్పారట!

టాలీవుడ్‌ మాస్‌ మహారాజా రవితేజ జోరు మీదున్నారు. ‘ఖిలాడి’, ‘టైగర్‌ నాగేశ్వర్‌రావు’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ‘రావణసుర’ ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అయితే, ‘రావణసుర’ తెరకెక్కిస్తున్న దర్శకుడు సుధీర్‌ వర్మతో రవితేజ కాంబినేషన్‌ వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగుంది. వీరిద్దరు కలిసి

Published : 28 Jan 2022 01:45 IST

హైదరాబాద్‌: కథానాయకుడు రవితేజ జోరు మీదున్నారు. ‘ఖిలాడి’, ‘టైగర్‌ నాగేశ్వర్‌రావు’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ‘రావణసుర’ ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అయితే, ‘రావణసుర’ తెరకెక్కిస్తున్న దర్శకుడు సుధీర్‌ వర్మతో రవితేజ కాంబినేషన్‌ వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగుంది. వీరిద్దరూ కలిసి మొదట ఒక తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని ప్లాన్‌ చేశారట. కానీ, ఆ సినిమాలో నటించడానికి తెలుగులోని స్టార్‌ హీరోలంతా విముఖత చూపడంతో రీమేక్‌ను పక్కనపెట్టి.. ‘రావణసుర’ను పట్టాలెక్కించారట. 

2017లో విడుదలైన తమిళ చిత్రం ‘విక్రమ్‌ వేద’ కోలీవుడ్‌లో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. అయితే, ఆ చిత్రం రవితేజకు బాగా నచ్చిందట. అందుకే, ఆ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు సుధీర్‌ వర్మతో రీమేక్‌ చేయాలని భావించారు. ఇందులో విజయ్‌ సేతుపతి పోషించిన ‘వేద’ పాత్రలో రవితేజ నటించాలని నిర్ణయించుకున్నారట. ఇక ఆర్‌. మాధవన్‌ పోషించిన ‘విక్రమ్‌’ పాత్ర కోసం తెలుగులో చాలా మంది హీరోలను సంప్రదించారట. కానీ, వారెవరూ ఆ పాత్రలో నటించేందుకు ముందుకు రాలేదు. విచిత్రంగా వాళ్లంతా ‘విక్రమ్‌’ పాత్రకు బదులు ‘వేద’ పాత్రలో నటించేందుకు ఆసక్తి కనబర్చారట. పాత్ర మార్చుకోవడానికి రవితేజ సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అందుకే, ఆ రీమేక్‌ను పక్కనపెట్టిన రవితేజ-సుధీర్ వర్మ.. ‘రావణసుర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని