lucifer: చిరంజీవి సోదరిగా ‘విద్యాబాలన్‌’?

బాలీవుడ్‌లో మహిళల ప్రాముఖ్యత గల చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటున్న నటీమణి విద్యాబాలన్‌. ఆమె నటించే సినిమాలు, పాత్రలు విభిన్నంగా ఉంటాయి. అందుకే ఆమె ప్రేక్షకుల అభిమానంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. 

Published : 04 Jun 2021 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటున్న నటీమణి విద్యాబాలన్‌. ఆమె నటించే సినిమాలు, పాత్రలు విభిన్నంగా ఉంటాయి. అందుకే ఆమె ప్రేక్షకుల అభిమానంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ‘‘సహజ సిద్ధంగా ఉన్న ఎలాంటి కథనైనా చేయడానికి నేను సిద్ధం’’ అని ఆమె గతంలోనే చెప్పారు. తాజాగా ఆమె మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించనుందనే వార్తలు వస్తున్నాయి. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరిపిందట. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఇప్పటికే పలువురు సీనియర్‌ నటీమణుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ పూర్తికాగానే  ‘లూసిఫర్’ సెట్స్‌పైకి వెళ్లనుంది. నటుడు సత్యదేవ్‌ ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని