కామ్రేడ్‌ రవన్నగా వస్తున్న రానా

తన పుట్టినరోజునాడు రానా ప్రేక్షకులకు ఒక విజవల్‌ ట్రీట్‌ ఇచ్చారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్‌ వారు నిర్మిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘విరాటపర్వం’లోని రాణా పాత్రను తెలుపుతూ ఒక

Updated : 14 Dec 2020 16:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన పుట్టినరోజున రానా సినీ ప్రేక్షకులకు ఒక విజువల్‌ ట్రీట్‌ ఇచ్చారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో రానా పాత్రను తెలుపుతూ ఒక వీడియో గ్లిమ్స్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ‘రివల్యూషన్‌ ఈజ్‌ ఆన్‌ యాక్ట్‌ ఆఫ్‌ లవ్‌’ అనేది ఉపశీర్షిక. ఆ వీడియోలో ‘ఈ దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది, సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది’ అంటూ తెలుపు, ఎరుపు రంగుల కలయికతో వస్తున్న పదాలు ఆసక్తి రేకేత్తిస్తున్నాయి.

శాంతి కాముకులమే.. కానీ హాని తలపెడితే మాత్రం విప్లవమే అన్నట్టు సూచిస్తున్నాయి‌. 90ల నాటి నక్సల్స్‌ వాతావరణం, నల్లమల అడవులు, చేతిలో తుపాకితో, మావోయిస్టు డాక్టర్‌ రవిశంకర్‌ అలియాస్‌ కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా చాలా ఇంటెన్సివ్‌గా కనిపించారు. ప్రియమణి, సాయిపల్లవి ఇతర ప్రధానపాత్రలలో నటిస్తుండగా, వాళ్లిద్దరికి సంబంధించి ప్రచారచిత్రాలు ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటున్నాయి. మరి ఆసక్తి రేపుతున్న కామ్రేడ్‌ రవన్న పరిచయ వీడియోను మీరు చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని