దేవుడు సీఎం అయినా ఉద్యోగాలివ్వలేడు

దేవుడే సీఎం అయినా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేడని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. శనివారం ఆయన ఆ రాష్ర్టంలోని గ్రామ పంచాయతీల బాధ్యులతో వెబినార్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 01 Nov 2020 01:13 IST

పనాజి: దేవుడే సీఎం అయినా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేడని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. శనివారం ఆయన గ్రామ పంచాయతీల బాధ్యులతో వెబినార్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ గెజిటెడ్‌ అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం ‘స్వయంపూర్ణ మిత్ర’ పథకానికి శ్రీకారం చుట్టింది. 

ఈ నేపథ్యంలో సీఎం ప్రమోద్‌ సావంత్‌ శనివారం ఈ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వ్యక్తి నెలకు రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకూ సంపాదించుకునేలా దిశానిర్దేశం చేయాలని పంచాయతీ బాధ్యులకు సీఎం సూచించారు. గోవాలో నిరుద్యోగుల శాతం 15.4 శాతానికి పెరిగినట్లు తాజా నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఆ రాష్ర్ట సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని