ముగిసిన జీహెచ్‌ఎంసీ పోలింగ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ ముగిసింది. జీహెచ్‌ఎంసీలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్‌ జరిగింది. నగర వ్యాప్తంగా అక్కడక్కడా చెదురుమదురు ఘర్షణలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా

Updated : 01 Dec 2020 18:51 IST

హైదరబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ ముగిసింది. జీహెచ్‌ఎంసీలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్‌ జరిగింది. నగర వ్యాప్తంగా అక్కడక్కడా చెదురుమదురు ఘర్షణలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓల్డ్‌ మలక్‌పేటలో సీపీఎం, సీపీఐ పార్టీల గుర్తులు తారుమారు కావడంతో అక్కడ పోలింగ్‌ను అధికారులు నిలిపివేశారు. డిసెంబర్ 3న ఓల్డ్‌ మలక్‌పేటలో రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. రీపోలింగ్‌ దృష్ట్యా ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. డిసెంబర్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటలలోగా క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

నగరంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారలు వెల్లడించారు. ఆర్‌సీ పురం-పటాన్‌చెరు, అంబర్‌పేట సర్కిళ్లలో అత్యధికంగా ఓటింగ్‌ నమోదు కాగా.. మలక్‌పేట, కార్వాన్‌ సర్కిళ్లలో అత్యల్పంగా ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే బల్దియా పోలింగ్‌పై వరుస సెలవులు ప్రభావం చూపించాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా  35.80 ఓటింగ్‌ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

GHMC: అందుకుందామా ఈ స్ఫూర్తి!

గ్రేటర్‌లో‌..పలుచోట్ల ఉద్రిక్తత

ఓల్డ్‌ మలక్‌పేటలో ఎల్లుండి రీ పోలింగ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని