‘మహారాష్ర్ట సర్కారు స్వయంగా కూలిపోతుంది’

మహారాష్ర్టలో అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ఆ రాష్ర్టంలో అధికారం కోసం భాజపా ప్రయత్నం చేయటం లేదని

Published : 13 Nov 2020 00:53 IST

శివసేన ప్రభుత్వంపై మాజీ సీఎం వ్యాఖ్య

ముంబయి : మహారాష్ర్టలో అధికారంలో ఉన్న శివసేన సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ జోస్యం చెప్పారు. ఆ రాష్ర్టంలో అధికారం కోసం భాజపా ప్రయత్నం చేయటం లేదని ఆయన వివరించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు భాజపాకు సానుకూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం మహారాష్ర్ట రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుందనే మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. 

‘ఇలాంటి ప్రభుత్వం(శివసేన) చాలా కాలం అధికారంలో ఉండలేదు. మహారాష్ర్టలో సర్కారు ఎప్పడు కూలిపోతే అప్పుడు మేము ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ విషయాన్ని ఆలోచించడం లేదన్నారు. అధికారంలో ఉన్న ఉద్దవ్‌ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. వాళ్లకు కావాల్సిన ఆర్థిక అవసరాలను తీర్చడంలో సర్కారు విఫలమైందని ఆయన విమర్శలు చేశారు. మహారాష్ర్టలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని ఫడణవీస్‌ పేర్కొన్నారు. బిహార్‌లో ఎన్డీయేకు అనుకూలంగా వచ్చిన ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావితం చూపుతాయని ఆయన చెప్పారు. దీంతో పాటు వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్‌ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాజా ఎన్నికల ప్రభావం ఉంటుందని వివరించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని