నితీశ్‌కు మంచి ఫేర్‌వెల్‌ ఇస్తారు : సంజయ్‌ రౌత్‌ 

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల పర్వం చివరి అంకానికి చేరుకుంది. గురువారంతో మూడో విడతకు సంబంధించి ప్రచార కార్యక్రమం ముగియగా.. ఈ రోజు చివరి విడత పోలింగ్‌ జరుగుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం సీఎం నితీశ్‌కుమార్‌ ఓ ప్రచారసభలో మాట్లాడారు. తనకు ఇవే చివరి ఎన్నికలని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

Published : 07 Nov 2020 15:33 IST

బిహార్‌ సీఎం తన ఇన్నింగ్స్‌ ఆడేశాడని వ్యంగ్యాస్ర్తాలు

  

ముంబయి : బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల పర్వం చివరి అంకానికి చేరుకుంది. గురువారంతో మూడో విడతకు సంబంధించి ప్రచార కార్యక్రమం ముగియగా.. ఈ రోజు చివరి విడత పోలింగ్‌ జరుగుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం సీఎం నితీశ్‌కుమార్‌ ఓ ప్రచారసభలో మాట్లాడారు. తనకు ఇవే చివరి ఎన్నికలని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. తాజా ఎన్నికల సందర్భంగా ఆ రాష్ర్ట ప్రజలు నితీశ్‌కు మంచి ఫేర్‌వెల్‌ ఇస్తారని వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. ‘నితీశ్‌ కుమార్‌ గొప్ప నాయకుడు. తన ఇన్నింగ్స్‌ ఆడేశాడు. ఓ నాయకుడు తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పినప్పుడు అతనికి కచ్చితంగా గౌరవంతో కూడిన ఫేర్‌వెల్‌ ఇవ్వాలి. దీని కోసం బిహార్‌ ప్రజలు ఎదురు చూస్తున్నారు’ అని సంజయ్‌ రౌత్‌ అన్నారు. 

ఇదిలా ఉంటే ఆ రాష్ర్టంలోని అధికార పార్టీ జేడీయూ నితీశ్‌కుమార్‌ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. నితీశ్‌ రాజకీయాల నుంచి రిటైర్‌ అవ్వడం లేదని తెలిపింది. ఆ పార్టీ బిహార్‌ అధ్యక్షుడు, ఎంపీ నరయిన్‌ సింగ్‌ కూడా సీఎం వాఖ్యలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. నితీశ్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారానికి సంబంధించినవి మాత్రమే అని పేర్కొన్నారు. బిహార్ ప్రజల తరఫున నితీశ్‌కుమార్‌ పని చేస్తూనే ఉంటారని వివరణ ఇచ్చారు. బిహార్‌లోని 16 జిల్లాల్లో 78 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ చివరి విడత పోలింగ్‌ జరుగుతోంది. ఈ నెల 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని