ఆర్థిక వ్యవస్థ వైఫల్యంపై దేవుళ్లను నిందిస్తారా?

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ పలు విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం చెందడానికి సీతారామన్‌ దేవుళ్లని నిందించడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు.

Published : 07 Sep 2020 01:11 IST

ముంబయి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ పలు విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం చెందడానికి సీతారామన్‌ దేవుళ్లని నిందించడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన శివసేన అధికారిక పత్రిక సామ్నా వేదికగా వెల్లడించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వైఫల్యానికి దేవుడిని నిందించడం మంచిది కాదు. పెద్ద నోట్ల రద్దు నుంచి లాక్‌డౌన్‌ వరకు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారింది. అలాంటిది సీతారామన్‌ ఇప్పుడు దేవుడిని ఎలా నిందిస్తారు. ఇక్కడే దైవంపై మీకున్న భక్తి తేటతెల్లం అవుతోంది. ప్రధాని మోదీ దేశంలో అన్ని సమస్యలను గురించి మాట్లాడుతున్నారు కానీ.. ఆర్థిక వ్యవస్థ వైఫల్యం గురించి మాత్రం నోరు మెదపరు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ 23.9శాతం దిగజారింది... ఇది కేవలం మనుషుల నిర్లక్ష్య వైఖరి వల్లే జరిగింది’అని విమర్శించారు. సీతారామన్‌ గత నెలలో దేశ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొవిడ్‌19 దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. దీన్ని దేవుడు నాటకంగా అభివర్ణించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని