Andhra News: అద్దంకి వైకాపా ఇన్‌ఛార్జ్‌కు నిరసన సెగ.. మెల్లగా జారుకున్న నేత

‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ నేతలకు నిరసన

Updated : 22 May 2022 11:31 IST

అద్దంకి: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ నేతలకు నిరసన సెగ ఎదురవుతూనే ఉంది. కొన్ని చోట్ల వైకాపా నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల తమ సమస్యలను ప్రజలు ఎకరువు పెడుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కుందుర్రులో అధికార పార్టీ నేతలను తమ సమస్యలపై పలువురు ప్రశ్నించారు. 

అద్దంకి వైకాపా ఇన్‌ఛార్జ్‌ బాచిన కృష్ణ చైతన్యను ఓ మహిళ నిలదీశారు. వీవోఏగా ఎప్పట్నుంచో తాను పని చేస్తున్నా.. జీతాలు సరిగా ఇవ్వడం లేదని వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని వారించారు. తమపై తెదేపా ముద్ర వేసి జీతాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సదరు ముస్లిం మహిళ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక కృష్ణ చైతన్య అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని