
Updated : 19 Nov 2021 14:46 IST
Chandrababu: క్షేత్రస్థాయిలో తేల్చుకున్నాకే మళ్లీ అసెంబ్లీకి వెళ్తా: చంద్రబాబు
అమరావతి: వైకాపా అరాచకపాలనపై తాను చేస్తున్న ధర్మపోరాటానికి ప్రజలంతా సహకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని.. అంతవరకూ వెళ్లనన్నారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘ఈ విషయాన్ని సభలోనే చెప్పాలనుకున్నా. అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదు.. అందుకే ఇక్కడ చెబుతున్నా. ప్రజల్లో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తా. ప్రజలు సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తా’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Advertisement
Tags :