Published : 23/09/2021 02:11 IST

Uma Bharati: నేనలా మాట్లాడి ఉండాల్సింది కాదు: ఉమాభారతి

భోపాల్‌: ప్రభుత్వ అధికార వ్యవస్థ ఓ మిథ్య.. అధికారులు ఉన్నది రాజకీయ నేతల చెప్పులు మోయడానికేనంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు తననే ఎంతగానో బాధ పెట్టాయన్నారు. తాను అలా మాట్లాడి ఉండాల్సిందికాదని ఆవేదన చెందారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు లేఖ రాసిన ఉమాభారతి.. తాను వాడే భాషను మరింతగా మెరుగుపరుచుకుంటానని పేర్కొన్నారు. 

శనివారం కొందరు ఓబీసీ నేతలు భోపాల్‌లో తన నివాసానికి వచ్చి కలిసిన సందర్భంగా బ్యూరోక్రసీపై ఉమాభారతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోమవారం సామాజిక మాధ్యల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ తీవ్రంగా స్పందించారు.ఆ భాష తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇందుకు గాను ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో మంగళవారం ఉమాభారతి దిగ్విజయ్‌ సింగ్‌కు లేఖ రాశారు. ‘‘నా సొంత వ్యాఖ్యలే నన్ను గాయపరుస్తున్నాయి. తీవ్ర పదజాలం వాడొద్దని నేను మీకు పదేపదే చెప్పేదాన్ని. ఇప్పట్నుంచి నేను నా భాషను మెరుగుపరుచుకుంటాను. మీరూ అలా చేయగలిగితే చేయండి’’ అని లేఖలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని