‘పెట్రో’ ధరలపై కేజ్రీవాల్‌ మౌనం ఎందుకు? 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతుంటే కేజ్రీవాల్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. నగరంలో ఇంధన ధరలపై వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ దిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం దృష్టికి

Published : 11 Jul 2021 01:05 IST

వ్యాట్‌ తగ్గించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌


దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతుంటే కేజ్రీవాల్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. నగరంలో ఇంధన ధరలపై వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ దిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీ ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.23లు, లీటరు డీజిల్‌పై రూ.13లు వ్యాట్‌ విధించడం ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. పెద్ద ఎత్తున వ్యాట్‌ విధిస్తున్నందుకు దిల్లీ ప్రజలు సీఎంను సమాధానం కోరుతున్నారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం విధిస్తున్న అధిక ఎక్సైజ్‌ సుంకంతో దిల్లీలో గతంలో ఎన్నడూ లేనంత ప్రియంగా మారాయన్నారు. ఇంధన ధరలు పైపైకి పోతుంటే దిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ధరలు తగ్గించే అంశంపై ప్రధానితో ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. పన్నులు తగ్గించాలని మోదీ ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదన్నారు. దిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర రూ.100.91 పైసలు కాగా.. డీజిల్‌ ధర రూ.89.88గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని