Punjab Polls: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలువాయిదా? నేడు ఈసీ నిర్ణయం!

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీని మార్చాలని అధికార కాంగ్రెస్‌ సహా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. దీనిపై చర్చించేందుకు నేడు ఈసీ భేటీ కానుంది...

Updated : 17 Jan 2022 11:24 IST

దిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీని మార్చాలని అధికార కాంగ్రెస్‌ సహా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఈసీ ఇటీవల ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం.. పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ, ఫిబ్రవరి 16న గురు రవిదాస్‌ జయంతి ఉంది. దానికి సంబంధించిన ఉత్సవాలు ముందే ప్రారంభమవుతాయి. పైగా, జయంతి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్తారని.. దీంతో ఓటు వేసే అవకాశం కోల్పోతారని పార్టీలు ఈసీకి తెలిపాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ తేదీని వారం పాటు వాయిదా వేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ఈసీకి విజ్ఞప్తి చేశారు. ప్రధాన పార్టీలైన బీఎస్పీ, భాజపా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీంతో ఈ విషయంపై నేడు కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీలో సమావేశమై నిర్ణయం తీసుకోనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని