Huzurabad By Election: హుజూరాబాద్‌లో ముగిసిన నామినేషన్ల గడువు

హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. తెరాస అభ్యర్థిగా గెల్లు

Updated : 08 Oct 2021 20:28 IST

కరీంనగర్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, భాజపా అభ్యర్థిగా ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. ఈనెల 30న హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది. నవంబరు 2న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంటుంది. నామినేషన్‌ వేసేందుకు ఉపాధిహామీ పథకం క్షేత్రసహాయకులు భారీగా తరలివచ్చినప్పటికీ నిబంధనల ప్రకారం వారిని అనుమతించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని