కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి?:ఎర్రబెల్లి

కేటీఆర్‌ అన్నివిధాల సమర్థమైన నాయకుడని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో రెండో విడత ‘పల్లెప్రగతి’ని మంత్రి

Updated : 02 Jan 2020 16:02 IST

వర్ధన్నపేట: కేటీఆర్‌ అన్నివిధాల సమర్థమైన నాయకుడని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో రెండో విడత ‘పల్లెప్రగతి’ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల ప్రగతి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొచ్చామని చెప్పారు. ఇళ్లతో పాటు గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. గ్రామానికి ప్రతి ఒక్కరూ సేవ చేయాలని తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటని వ్యాఖ్యానించారు. కోతలు లేకుండా చేసి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో భాజపాకు డిపాజిట్లు రావని, కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఉంటుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి జరగకుండా అడ్డుకోవడానికి విపక్షాలు చూడటం సాధారణమేనన్నారు. అన్ని మున్సిపాలిటీలు తెరాస కైవసం చేసుకుంటుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని