ప్రత్యేక హోదా ముగిసిందని ఎప్పుడో చెప్పాం

రాష్ట్రాల అంశాల ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్‌ను చూడటం సరికాదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. అమరావతిలో ఐఐసీహెచ్‌ ఏర్పాటు చేయాలని

Updated : 02 Feb 2020 01:58 IST

జీవీఎల్‌

దిల్లీ: రాష్ట్రాల అంశాల ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్‌ను చూడటం సరికాదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. అమరావతిలో ఐఐసీహెచ్‌ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరతానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించి ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని గతంలోనే చెప్పామని ఈ సందర్భంగా మరోసారి ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయంగా వాడుకోవడానికే ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు. జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌లకు ఇచ్చినట్లే ఏపీకి ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. పోలవరానికి నాబార్డు ద్వారా కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల  మేరకు మౌలిక వసతుల కల్పన చేపట్టినట్టు జీవీఎల్‌ చెప్పారు. ఆశించిన స్థాయిలో రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని సమాచారం ఉందన్న ఆయన.. పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు యూసీలు ఇంకా రావాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని