ఆటో డ్రైవర్లే వీఐపీలు: ఆప్‌ 

దిల్లీ: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అంటేనే రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, వారి బంధువులే వీఐపీలుగా ఉంటారు. కానీ, దీనికి భిన్నంగా ఆమ్‌ఆద్మీ పార్టీ ఈసారి సాధాసీదా వ్యక్తులను వీఐపీలుగా ఆహ్వానిస్తోంది.

Updated : 16 Feb 2020 00:50 IST

ప్రమాణస్వీకారానికి సామాన్యులను ఆహ్వానించిన కేజ్రీవాల్‌ 

దిల్లీ: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అంటేనే రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, వారి బంధువులే వీఐపీలుగా ఉంటారు. కానీ, దీనికి భిన్నంగా ఆమ్‌ఆద్మీ పార్టీ ఈసారి సాధాసీదా వ్యక్తులను వీఐపీలుగా ఆహ్వానిస్తోంది. ఆదివారం జరగబోయే కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి దాదాపు యాభైమంది సామాన్యులు కేజ్రీవాల్‌తో వేదిక పంచుకోబోతున్నట్లు ఆమ్‌ఆద్మీ నేత మనీష్‌ సిసోడియా వెల్లడించారు. రామ్‌లీలా మైదానంలో జరగబోయే ఈ కార్యక్రమానికి అట్టడుగువర్గాల వారిని ఆహ్వానించాలని కేజ్రీవాల్‌ నిర్ణయించినట్లు తెలిపారు. 

ముఖ్యంగా ఆటో, అంబులెన్స్‌, బస్సు డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పాఠశాల ప్యూన్లు, మొహల్లా క్లినిక్‌ డాక్టర్లు, ఇలా వివిధ వర్గాలకు చెందిన యాభై మందిని ఆహ్వానించామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మధ్యే మాస్కో ఒలింపియాడ్‌లో పథకాలు సాధించిన విద్యార్థులు, ఉద్యోగ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను కూడా ఆహ్వానించామన్నారు. రేపు జరగబోయే కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 

ఇప్పటికే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించారు కేజ్రీవాల్. అయితే వారణాసి పర్యటన దృష్ట్యా దీనికి హాజరు అవుతారా?లేరా?అన్నది ఇంకా ఖరారు కావాల్సిఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని