పేదలు ఆకలితో మరణిస్తుంటే ఇలా చేస్తారా!

బియ్యం నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేసి దాంతో శానిటైజర్లు తయారు చేస్తారని వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీటర్‌ వేదికగా స్పందించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో ప్రజలంతా ఒకవైపు ఆకలితో మృత్యువాతపడుతుంటే....

Updated : 22 Apr 2020 01:00 IST

బియ్యంతో శానిటైజర్ల తయారీకి అనుమతిపై రాహుల్ గాంధీ ట్వీట్‌

న్యూదిల్లీ: బియ్యం నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేసి దాంతో శానిటైజర్లు తయారు చేస్తారని వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో ప్రజలంతా ఒకవైపు ఆకలితో అలమటిస్తుంటే, శానిటైజర్ల ఉత్పత్తి కోసం బియ్యం సరఫరాకు అనుమతి ఇస్తారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

‘పేదల్లారా.. ఎప్పుడు మేల్కొంటారు..? మీరు ఆకలితో మరణిస్తుంటే.. వారు మీ భాగం బియ్యం నుంచి తయారు చేసిన శానిటైజర్లతో సంపన్నుల చేతులు శుభ్రం చేసే పనిలో ఉన్నారు’ అని మంగళవారం ట్వీట్‌ చేశారు. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)లో అందుబాటులో ఉన్న మిగులు బియ్యంతో ఇథనాల్‌ ఉత్పత్తి చేసి శానిటైజర్లు తయారు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ మేరకు ఆయన ఒక వార్త కథనాన్ని ట్వీట్‌కు జతచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని