బాలకృష్ణ కోపం నిమిషం మాత్రమే:పోసాని

అగ్ర కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోపం నిమిషం మాత్రమేనని నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన

Updated : 07 Jun 2020 20:31 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోపం నిమిషం మాత్రమేనని నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాలకృష్ణ మాటలను సీరియస్‌గా తీసుకొని ఎవరూ బాధపడవద్దని కోరారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై పోసాని మండిపడ్డారు. 

‘‘తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం. కేటీఆర్‌పై మాట్లాడే హక్కు రేవంత్‌రెడ్డికి లేదు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ రేవంత్‌ అనేకసార్లు జైలుకు కూడా వెళ్లారు. కేటీఆర్‌, కేసీఆర్‌ నిజాయతీ పరులు. పేపర్‌లో వచ్చిన అంశాలను నమ్మొద్దు. మంచి నాయకులపై బురదజల్లడం సరికాదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. అది చూసి ప్రతిపక్షాలు  మెచ్చుకోవాలి. దేశం కోసం యుద్ధం చేసిన వ్యక్తి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించడం సరికాదు. ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. తాగేందుకు, సాగు చేసుకునేందుకు, పరిశ్రమలకు కోసం నీరు అందించడమే లక్ష్యంగా దీన్ని నిర్మించారు. అంత గొప్ప ప్రాజెక్టును కమిషన్‌ కోసం నిర్మించారనడం సరికాదు. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం నాగార్జునాసాగర్‌ నిర్మించింది. అది కూడా ప్రజల కోసమే నిర్మించారు. ఆ ప్రాజెక్టును కూడా కమిషన్ల కోసం నిర్మించారంటే బాగుండదు కదా!  తెలంగాణ కోసం పోరాడిన అతి ముఖ్యమైన వ్యక్తుల్లో కేసీఆర్‌ ఒకరు. ఏపీ తెలంగాణ సీఎంలు అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తున్నారు. జల వివాదంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని భావిస్తున్నా. చర్చలతోనే నీటి సమస్య పరిష్కారం అవుతుంది’’అని పోసాని కృష్ణ మురళి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని