అయ్యన్నకు ఊరట.. అరెస్టుపై స్టే

మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన నిర్భయ కేసులో అరెస్టుపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను....

Updated : 22 Jun 2020 14:24 IST

అమరావతి : మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన కేసులో అరెస్టుపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. 

ఇటీవల అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్యంగా దూషించారనే ఆరోపణలపై ఆమె చేసిన ఫిర్యాదుతో నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై పెట్టిన కేసును ఎత్తివేయాలని అయ్యన్నపాత్రుడు కోర్టును ఆశ్రయించారు. అరెస్టును నిలుపుదల చేయాలని కోరారు.

ఇదీ చదవండి..

అయ్యన్నపాత్రుడిపై ‘నిర్భయ’ కేసు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని