Published : 06/07/2020 15:54 IST

ప్రశ్నలే.. సమావేశాల్ని పట్టించుకోని రాహుల్‌

ఒక్కసారీ రక్షణశాఖ స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి రాని కాంగ్రెస్‌ నేత

ముంబయి: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై భారతీయ జనతాపార్టీ తీవ్ర విమర్శలు చేసింది. పదేపదే సైనికుల పరాక్రమాన్ని ప్రశ్నిస్తూ వారి స్థైర్యాన్ని దెబ్బతీస్తున్న ఆయన‌ ఒక్కసారీ రక్షణశాఖ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు హాజరుకాలేదని నొక్కిచెప్పింది. ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేమీ ఆయనకు లేవని భాజపా అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ఎద్దేవా చేశారు.

‘రక్షణశాఖ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు ఎప్పుడూ రాహుల్‌ గాంధీ హాజరవ్వలేదు. జాతి, సైనిక బలగాల పరాక్రమాన్ని మాత్రం అవమానిస్తూనే ఉండటం విచారకరం. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు ఏమీ చేయకూడదో రాహుల్‌ అదే చేస్తారు’ అని నడ్డా ట్వీట్‌ చేశారు.

‘రాహుల్‌ గాంధీ ఒక వారసత్వ సంప్రదాయానికి చెందిన వ్యక్తి. రక్షణరంగం అంశానికొస్తే ఆయనకు కమిటీలు ముఖ్యం కాదు. కమీషన్లు ముఖ్యం. పార్లమెంటరీ వ్యవహారాలను అర్థంచేసుకోగలిగే అర్హత ఉన్న నాయకులు కాంగ్రెస్‌లో చాలామంది ఉన్నారు. కానీ, అలాంటి నేతలను కాంగ్రెస్‌లోని ఒక వారసత్వం ఎదగనివ్వకపోవడం బాధాకరం’ అని నడ్డా మరో ట్వీట్‌ చేశారు.

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ గురించి రాహుల్‌ గాంధీ పదేపదే ప్రశ్నలు వేస్తున్నారు. నరేంద్రమోదీ చైనాకు ‘సరెండర్‌ మోదీ’ అని ఎద్దేవా చేశారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా అని ప్రశ్నించారు. కాగా, వీటిని పార్లమెంటు సమావేశాల్లో చర్చిద్దామని మంత్రులు, నేతలు చెబుతున్నప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాగా, గతేడాది ఏర్పాటు చేసిన రక్షణశాఖ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు రాహుల్‌గాంధీ ఒక్కసారీ హాజరుకాలేదని లోక్‌సభ వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ నుంచి 11 సార్లు కమిటీ సమావేశమవ్వగా వీటికి ఆయన రాకపోవడం గమనార్హం.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని