Trinamool: కాంగ్రెస్‌ కోసం నిరవధికంగా నిరీక్షించలేం: తృణమూల్‌

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే క్రమంలో కాంగ్రెస్‌ కోసం తాము నిరవధికంగా ఎదురుచూస్తూ ఉండలేమని..

Published : 27 Oct 2021 11:25 IST

దిల్లీ: భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే క్రమంలో కాంగ్రెస్‌ కోసం తాము నిరవధికంగా ఎదురుచూస్తూ ఉండలేమని తృణమూల్‌ కాంగ్రెస్‌ తెలిపింది. కూటమి ఏర్పాటుపై తమ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివిధ రాజకీయ పార్టీలను సంప్రదించారని, ఇంతవరకు స్పందన రాలేదని టీఎంసీ సీనియర్‌ నేత సుఖేందు శేఖర్‌ రే మంగళవారం దిల్లీలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను వీడి టీఎంసీలో చేరిన సుస్మితా దేవ్‌...రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు పలువురు విపక్ష నేతలను మమత కలిసి కూటమి ఏర్పాటును ప్రతిపాదించారని వెల్లడించారు. ‘ఆరునెలలు నిరీక్షించాం. ఇతర పార్టీల నుంచి ఎలాంటి స్పందన, చొరవ లేదు. దీంతో టీఎంసీని విస్తరించాలని నిర్ణయించాం. అంతర్గత సమస్యలతో కాంగ్రెస్‌ పార్టీ తీరికలేకుండా ఉందేమో. కూటమిగా ఏర్పాటు కావడమా, ఒంటరిగా పోటీ చేయడమా అన్నది కాంగ్రెస్, ఇతర పార్టీల వైఖరిపైనే అధారపడి ఉంటుంద’ని సుఖేందు అన్నారు. పార్లమెంటు లోపల వివిధ అంశాలపై సమన్వయంతో వ్యవహరించిన పార్టీలు సభ వెలుపల కూడా అలాగే ఎందుకు పనిచేయవని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని