TS News: రైతు పాటకు పాదాభివందనం చేసిన రేవంత్‌రెడ్డి

నగరంలోని ధర్నా చౌక్‌లో రెండో రోజూ కాంగ్రెస్‌ వరి దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షకు మద్దతు ప్రకటించిన తెలంగాణ

Updated : 06 Dec 2023 14:50 IST

హైదరాబాద్ : నగరంలోని ధర్నా చౌక్‌లో రెండో రోజూ కాంగ్రెస్‌ వరి దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షకు మద్దతు ప్రకటించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌.. కాంగ్రెస్‌ నేతలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.

ఈ దీక్ష సందర్భంగా.. రైతుల సమస్యలు, శాశ్వత పరిష్కారంపై అద్భుతమైన పాట పాడిన 93 ఏళ్ల రాంరెడ్డి అనే వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అభినందించారు. వేదికపైనే ఆయనకు పాదాభివందనం చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనని అభినందించి ఆలింగనం చేసుకున్నారు. ఆయన రాసిన పాటను ముద్రించి పంచి పెడతామని సభకు అధ్యక్షత వహించిన టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ వరి దీక్ష కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని