జగన్‌ ట్వీట్‌పై జేఎంఎం కౌంటర్‌

ప్రతిపక్షనేత చంద్రబాబుపై వ్యతిరేకతతోనే ఏపీ సీఎం జగన్‌ కేంద్రంతో స్నేహం చేస్తున్నారని ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) విమర్శించింది. కరోనా కష్టకాలంలో

Published : 09 May 2021 00:51 IST

అమరావతి: స్వప్రయోజనాల కోసమే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీ సీఎం జగన్‌ భాజపాకు దగ్గరవుతున్నారని ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) విమర్శించింది. కరోనా కష్టకాలంలో  రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలను ప్రధాని వినడం లేదంటూ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌  ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ.. ఇది కొవిడ్‌పై యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదని.. ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమని హేమంత్‌సోరెన్‌కు సూచిస్తూ ట్వీట్‌ చేశారు. దీనిపై  తాజాగా జేఎంఎం కౌంటర్‌ ఇచ్చింది. ‘‘ ఏపీకి కేంద్రం నుంచి పూర్తి మద్దతు అందుతోంది. కానీ, కేంద్రం వైఖరితో చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. జగన్‌ కంటే ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రికి ఎంతో పరిణతి ఉంది’’అని జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని