
Updated : 10 Jun 2021 14:48 IST
Raghurama: సీఎం జగన్‌కు రఘురామ లేఖ
అమరావతి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. వృద్ధాప్య పింఛన్లను ఈనెల నుంచి రూ.2,750కు పెంచి ఇవ్వాలని ఆయన సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పింఛను కూడా కలిపి రూ.3 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వైకాపా ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ హామీకి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించిందని తెలిపారు.
ఇవీ చదవండి
Advertisement
Tags :