‘నల్ల చట్టాల రూపశిల్పి ఆయనే’.. అమరీందర్‌పై సిద్ధూ విమర్శలు! 

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌పై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తీవ్ర విమర్శలు చేశారు. నల్ల చట్టాల (మూడు వ్యవసాయ చట్టాలు) రూపశిల్పి ఆయనేననంటూ ఆరోపించారు.

Published : 22 Oct 2021 01:39 IST

చండీగఢ్‌: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌పై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తీవ్ర విమర్శలు చేశారు. నల్ల చట్టాల (మూడు వ్యవసాయ చట్టాలు) రూపశిల్పి ఆయనేననంటూ ఆరోపించారు. ఈ మేరకు అమరీందర్‌ సింగ్‌ గతంలో మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశారు. కొత్తపార్టీ పెడతానని అమరీందర్‌ సింగ్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతుల సమస్య సానుకూలంగా పరిష్కారమైతే.. 2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, అకాలీ గ్రూపులు వంటి మిత్రపక్షాలతో పొత్తులు పెట్టుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో అమరీందరే ఈ చట్టాలకు రూపశిల్పి అంటూ వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్‌ చేశారు.

‘‘మూడు నల్ల చట్టాలను రూపశల్పి.. పంజాబ్‌ వ్యవసాయంలోకి అంబానీని ఆహ్వానించిందెవరు? పంజాబ్‌ రైతులను, చిన్న వ్యాపారులను, కూలీలను నాశనం చేసిందెవరు? ఒకరిద్దరు కార్పొరేట్లకు మేలు చేసిందెవరు?’’ అంటూ అమరీందర్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. దీంతో పాటు కార్పొరేట్‌ వ్యవసాయానికి అనుకూలంగా అమరీందర్‌ గతంలో మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా పోస్ట్‌ చేశారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఈ రంగం పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందన్న భయాల నేపథ్యంలో రైతులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రైతుల సమస్య పరిష్కారమైతే వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉంటుందని అమరీందర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయనను ఇరుకున పెట్టేలా సిద్ధూ వీడియో పోస్ట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని