Amarinder Singh: సిద్ధూకి పాక్‌తో సంబంధాలు.. సీఎంని చేస్తే దేశానికే ప్రమాదం!

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూపై ఆ పార్టీ సీనియర్‌ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధూ ఓ అసమర్థుడని.. ......

Published : 18 Sep 2021 19:39 IST

చండీగఢ్‌: పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూపై ఆ పార్టీ సీనియర్‌ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధూ ఓ అసమర్థుడని.. అతడిని తదుపరి సీఎంగా ప్రతిపాదిస్తే తాను అంగీకరించబోనన్నారు. అతడికి పాక్‌తో సంబంధాలు ఉన్నాయని, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జావేద్‌ బజ్వాలతో స్నేహం ఉందని చెప్పారు. సిద్ధూ సీఎం అయితే, దేశ భద్రతకే ముప్పు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ ఓ విపత్తుగా మారే అవకాశం ఉందంటూ కెప్టెన్‌ హెచ్చరించారు. తాను కేటాయించిన ఒక్క మంత్రి పదవిని కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారన్నారు.

మరోవైపు, సీఎం పదవికి  కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామాతో పంజాబ్‌ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. సీఎల్పీ కొత్త నేతను ఎన్నుకొనేందుకు సమావేశమైన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం.. ఆ బాధ్యతను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకే అప్పగించాలని నిర్ణయించిందని అజయ్‌ మాకెన్‌ తెలిపారు. అమరీందర్‌ సేవలను ప్రశంసిస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. ఈ రెండు తీర్మానాలను అధిష్ఠానానికి పంపామని, కొత్త సీఎల్పీ నేత ఎవరనే అంశంపై అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని