Punjab Politics: కెప్టెన్‌ వ్యూహమేంటీ..? అమిత్‌ షాతో మరోసారి భేటీ ఎందుకు?

మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయాలు రోజురోజుకీ హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ ఆ పార్టీ నుంచి వైదొలిగిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌

Published : 18 Oct 2021 12:54 IST

చండీగఢ్‌: మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ ఆ పార్టీ నుంచి వైదొలిగిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తదుపరి కార్యాచరణపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన భాజపాలో చేరుతారని తొలుత వార్తలు రాగా.. వాటిని కెప్టెన్‌ ఖండించారు. దీంతో సొంత పార్టీ పెడతారనే ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉండగా.. అమరీందర్ సింగ్‌ మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది. 

కెప్టెన్‌ సోమవారం దిల్లీకి చేరుకోనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. సీఎంగా రాజీనామా చేసిన తర్వాత నెల రోజుల వ్యవధిలో అమరీందర్‌ సింగ్‌ దిల్లీ పర్యటనకు వెళ్లడం ఇది మూడోసారి కావడం గమనార్హం. పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనపై చర్చించేందుకు ఆయన హోంమంత్రితో సమావేశమవుతున్నట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

కాగా.. సెప్టెంబరు 29న అమిత్ షాతో కెప్టెన్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భాజపాలో చేరుతారనే వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను ఖండించిన అమరీందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌లో ఉండను.. భాజపాలో చేరను అని స్పష్టం చేశారు. అయితే మరికొద్ది నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సొంతంగా పార్టీ పెట్టాలని కెప్టెన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకునేందుకు కూడా సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపైనా నేడు అమిత్ షాతో చర్చించే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో వినికిడి..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని