Rajnath Singh: ఆయన పేరు వింటే నేరస్థులకు వణుకే..: రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలు

యూపీలోని మహారాజ్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన ఆదిత్యనాథ్‌కు మత గురువైన అవైద్యనాథ్ విగ్రహాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......

Published : 25 Sep 2021 01:18 IST

యోగిని ప్రశంసల్లో ముంచెత్తిన కేంద్రమంత్రి

మహారాజ్‌గంజ్‌: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన నిజాయతీని ఎవరూ శంకించలేరని, యోగి పేరు వింటే నేరస్థులకు వణుకేనంటూ వ్యాఖ్యానించారు. యూపీలోని మహారాజ్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన యోగి ఆదిత్యనాథ్‌కు మత గురువైన అవైద్యనాథ్ విగ్రహాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగి తన గురువు చూపిన బాటలోనే నడుస్తున్నారన్నారు. ఆయన బహుళ పాత్రలు పోషించగల వ్యక్తి అని.. సనాతన ధర్మంతో పాటు రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నారని ప్రశంసించారు.

యోగి పేరు వింటే నేరస్థులకు వణుకు మొదలువుతుందని, వారి గుండె కొట్టుకొనే వేగం కూడా పెరుగుతుందన్నారు. యోగి నిజాయతీని ఎవరూ శంకించలేరని తెలిపారు. గోరఖ్‌పూర్‌ వర్శిటీలో తాను విద్యార్థిగా ఉన్నప్పటి జ్ఞాపకాలను, గోరఖ్‌నాథ్‌ పీఠ్‌ అధిపతిగా అవైద్యనాథ్‌ ఉన్నప్పుడు ఆయనతో తనకు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కూడా కొనియాడారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రధానితో కలిసి పనిచేస్తున్నారని, దేశ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నారని కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని