Updated : 01/11/2021 15:36 IST

Renuka Chowdary: ట్రాక్టర్‌ నడిపిన రేణుక.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు మద్దతు

అమరావతి: రాజధాని రైతుల మహా పాదయాత్రకు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి మద్దతు పలికారు. రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ పాదయాత్రలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు. రైతు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అమరావతి అనే పిలుపు 683 రోజుల నుంచి నడుస్తోంది. ఈ పిలుపునకు మేమంతా స్పందించి వస్తున్నాం.. రైతాంగానికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుకు రావడం కాంగ్రెస్‌ లక్ష్యం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు పోరాడుతూ రైతుల వాణిని  కేంద్రానికి వినిపించడానికి పూనుకొన్నాం. ఇంత మంది మహిళలు నాకు కేవలం బొట్టుపెట్టి స్వాగతం పలుకుతామంటే పోలీసులు వారిని కనీసం నిలబడనీయడంలేదు. ఏం ఫర్వాలేదు. నేనే వారికి వీరతిలకం దిద్దుతా’’ అని పేర్కొన్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని