Navjot Singh Sidhu: పంజాబ్‌లో ప్రచారాస్త్రాలివే.. సోనియాకు సిద్ధూ లేఖ!

వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రచారంలో అనుసరించాల్సిన 13 పాయింట్ల అజెండాను అందులో పొందుపరిచారు....

Published : 17 Oct 2021 14:23 IST

చండీగఢ్‌: వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రచారంలో అనుసరించాల్సిన 13 పాయింట్ల అజెండాను అందులో పొందుపరిచారు. అలాగే మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వివరించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన అక్టోబరు 15న లేఖ రాశారు. దాన్ని నేడు ట్విటర్‌లో ఉంచారు.

ఇటీవలే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ.. రాహుల్‌ గాంధీ, కె.సి.వేణుగోపాల్‌ను కలిసిన అనంతరం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. వారితో భేటీ సమయంలో తాను లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి వారు హామీ ఇచ్చారని తెలిపారు. సోనియా నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

లేఖలో సిద్ధూ మాదకద్రవ్యాల సమస్య, వ్యవసాయ సమస్యలు, ఉద్యోగావకాశాలు, విద్యుత్తు, పీపీఏ, వెనుకబడిన తరగతుల సంక్షేమం, సింగిల్‌ విండో పారిశ్రామిక విధానం, మహిళా సాధికారత, మద్యం, ఇసుక తవ్వకాలు, రవాణా, కేబుల్‌ మాఫియా.. ఇలా మొత్తం 13 అంశాలను పొందుపరిచారు. ఆయా రంగాల్లో చేయాల్సిన కృషిపై వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని