‘ఆ పార్టీల వల్ల కుటుంబాలే బాగుపడతాయి’
భాజపా మినహా దేశంలో చాలా వరకు కుటుంబ ఆధారిత రాజకీయ పార్టీలే ఉన్నాయని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అలాంటి పార్టీల వల్ల కేవలం ఆయా కుటుంబాలు మాత్రమే బాగుపడతాయని.. పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు.
దిల్లీ: భాజపా మినహా దేశంలో చాలా వరకు కుటుంబ ఆధారిత రాజకీయ పార్టీలే ఉన్నాయని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అలాంటి పార్టీల వల్ల కేవలం వారి కుటుంబాలు మాత్రమే బాగుపడతాయని.. పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో భాజపా కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఎప్పుడైనా సరే ఒక పార్టీ కార్యాలయం నాయకుడి ఇంటి నుంచి నడుస్తుందంటే.. ఆ పార్టీ కేవలం ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించినది అవుతుంది. ఇలాంటివి మనం ఇతర పార్టీల్లో చూస్తుంటాం. ఆ పార్టీల్లో వారి కుటుంబసభ్యులే కీలక పాత్ర పోషిస్తుంటారు. కానీ భాజపా విషయానికొస్తే పార్టీయే మన కుటుంబం. ఇక్కడ కార్యకర్తలు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాంగ్రెస్ సహా ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ నాయకుడి కుమారులు, సోదరులు, తల్లులను రక్షించుకోవడం కోసమే పనిచేస్తుంటాయి. భాజపా ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ. పార్టీ కార్యకర్తలే కుటుంబంగా పనిచేస్తుంది’ అని నడ్డా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..