AP News: పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలి: సోము వీర్రాజు

పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేసి, ఉద్యోగులను మళ్లీ చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. గురువారం...

Published : 20 Jan 2022 16:06 IST

కర్నూలు: పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేసి, ఉద్యోగులను మళ్లీ చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. గురువారం  కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ....‘‘ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం పనిచేయలేదు. రాష్ట్రంలో ఇంటి అద్దె పెరిగిపోయి, హెచ్‌ఆర్‌ఏ తగ్గించడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా కాకుండా ఎనిమి గవర్నమెంట్‌గా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు చేయలేదు. ఉద్యోగుల పక్షాన భాజపా అండగా ఉంటుంది’’ అని సోము వీర్రాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని