దీపన్‌ ప్రచారంలో మెరిసెన్‌..

ప్రజల జీవితంలో భాగంగా మారిన సామాజిక మాధ్యమాలు ఎన్నికల ప్రచారాలకు వేదికగా మారుతున్నాయి. భారీ మైకులు, పెద్దపెద్ద ప్రచార సాధనాలతో పనిలేకుండా డిజిటల్‌ ప్రచారంతో ఓ యువకుడు దూసుకుపోతున్నాడు. తనకు తెలిసిన సాంకేతికతను వినియోగించుకొని...

Published : 01 Apr 2021 01:05 IST

సామాజిక మాధ్యమాలే వేదికగా యువ అభ్యర్థి ప్రచారం

చెన్నై: ప్రజల జీవితంలో భాగంగా మారిన సామాజిక మాధ్యమాలు ఎన్నికల ప్రచారాలకు వేదికగా మారుతున్నాయి. భారీ మైకులు, పెద్దపెద్ద ప్రచార సాధనాలతో పనిలేకుండా డిజిటల్‌ ప్రచారంతో ఓ యువకుడు దూసుకుపోతున్నాడు. తనకు తెలిసిన సాంకేతికతను వినియోగించుకొని డిజిటల్‌ మాధ్యమంలోనే ప్రచారం చేస్తూ తమిళ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు యూట్యూబర్‌ దీపన్‌ చక్రవర్తి. తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో దీపన్‌ చక్రవర్తి నమక్కల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే విస్త్రృత ప్రచారానికి కావాల్సినంత డబ్బు లేకపోవడంతో సామాజిక మాధ్యమాలనే ఉపయోగించుకుంటూ యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

తొలుత రిపోర్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దీపన్‌ ‘చెన్నై వ్లాగర్‌ దీపన్‌’ పేరుతో రోజూ యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేసేవారు. అలా తమిళ యువతకు దగ్గరైన దీపన్‌.. తన అనుభవాన్ని, యువతలో తనకున్న క్రేజ్‌ను ఎన్నికల ప్రచారంలోనూ వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నామినేషన్‌ దాఖలు చేయడం మొదలు, ఎన్నికల గుర్తును ప్రచారం చేయడం ఇలా ప్రతి అంశాన్ని వీడియో తీసి తన ఛానల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. యువతకు తన సిద్ధాంతాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు యువత, ప్రజలకు అందించేందుకు ‘ఐ దీపన్‌ ఆన్‌ ఎమ్మెల్యే’ అనే వెబ్‌ పేజీని కూడా రూపొందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని