
Published : 15 May 2021 15:29 IST
ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?: అయ్యన్న
విశాఖ: ప్రభుత్వమన్నాక రాజకీయ నాయకులు, ప్రజలు అంతా ప్రశ్నిస్తారని, అంతమాత్రం చేత అరెస్టు చేస్తారా? అని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టును ఆయన ఖండించారు. సీఎం జగన్ వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని వాటిని నాశనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అయ్యన్న పిలుపునిచ్చారు. సీఐడీ అధికారులు అక్కడికక్కడే నోటీసులు రాసి ఇంటికి అంటించి రఘురామను అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, పరీక్షల రద్దు గురించి మాట్లాడితే తప్పా?జగన్ బెయిల్ రద్దు చేయమన్నందుకే అరెస్టు చేస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇవీ చదవండి
Advertisement
Tags :